Home కామారెడ్డి నెరవేరని దశాబ్దాల కల పెద్దాయిపల్లి ప్రాజెక్టు

నెరవేరని దశాబ్దాల కల పెద్దాయిపల్లి ప్రాజెక్టు

paipu-line-image

రైతుల చిరకాల స్వప్నం కాగితాలకే పరిమితం
ప్రాజెక్టు నిర్మాణంతో 40 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి
పూర్తయిన ఇంజినీర్ల సర్వే
ప్రాజెక్టు నిర్మిస్తే ఎనిమిది మండలాలకు వరం
గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేక నిర్మాణానికి నోచుకోని ప్రాజెక్టు

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి ప్రాంతంలో బీడు భూములను సస్య శ్యామలం చేసే పెద్దాయిపల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించాలని దశాబ్దాలుగా అన్న దాతలు డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట మండలంలోని పెద్దాయిపల్లి ఆర్గోండ గ్రామాలలో ఈ డ్యాం నిర్మించాలని రైతులు ఇక్కడి ప్రాంత రైతులు చిరకాలంగా కోరుతున్నారు. కామారెడ్డిలో ప్రాజెక్టు, నీటి కాలువలు లేక వర్షాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. రాజంపేట మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని 2 గుట్టల మధ్య రిజర్వాయర్ నిర్మించాలని బిక్కనూరు. రాజంపేట, దొమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి మండలాల ప్రజలు, కర్షకులు కోరుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఇరిగేషన్ అధికారులు, రైతులు సర్వే చేసి ప్రాజె క్టు నిర్మాణానికి  అనూకూలమని  నివేదికలు ఇచ్చారని రైతులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు. ఎనిమిది మండలాల ప్రజలకు సాగునీరుతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. పొందుర్తి తలమడ్ల ఆరెపల్లి, రాజంపేట, జంగంపల్లి, దోమకొండ చెరువుల్లో నీరు ఉంటుందని రైతులు కోరుతున్నారు. నాటి ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహం లేక కామారెడ్డి ఇరిగేషన్  ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదని ఇప్పుడైనా ప్రాజెక్టు నిర్మించి 40 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రూ.360 కోట్ల  గోదావరి జలాల పథకం ఫలితం ఇవ్వలేదని, ప్రాణహిత చేవెళ్ల 20,21,22, ప్యాకేజీ పనులు ముందుకు సాగడంలేదని కామారెడ్డి రైతాంగం ఆవేదన చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కామారెడ్డి నియోజకవర్గం  చివరి ప్రాంతం కావడంతో సాగునీటి అవసరాలు తీరడం లేద ని బెంగపడుతున్నారు. పెద్దాయిపల్లి ప్రాజెక్టు కడితే ఈ ప్రాంత రైతుల పెన్నిధి గా మారుతుందని ఆశతో ఉన్నారు. 500 ఫీట్ల వరకు బోర్లు వేసి నీరు రాక అప్పుల పాలవుతున్నారు. భూములన్నీ పడావుగా ఉండడంతో యువకులు ముంబై, దుబాయి వలస పోతున్నారు. రైతాంగ డిమాండ్ ఉన్న పెద్దాయిపల్లి ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గోం డ పెద్దాయిపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు వృధా అవుతుందని రెండు గుట్టల మధ్య డ్యాం నిర్మిస్తే 8 మండలాల ప్రజలు సంతోషిస్తారని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయం గాడిన పడుతుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రాణహితచేవె ళ్ల 22వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కామారెడ్డి చివరి ప్రాంతం కావడంతో సాగునీరు వస్తాయో రావోనని దిగు లు చెందుతున్నారు. జిల్లాలో నిజాంసాగర్, పోచారం, కౌలాస్ నాలా, కళ్యాణి, గుజ్జొలు వాగు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని పెద్దాయిపల్లి నిర్మిస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సాగునీటి కొరత తీరుతుందని ఆశిస్తున్నారు.