Home జిల్లాలు ఉపాధ్యాయుల కృషితోనే మెరుగైన ఫలితాలు: కలెక్టర్ రోనాల్డ్‌రోస్

ఉపాధ్యాయుల కృషితోనే మెరుగైన ఫలితాలు: కలెక్టర్ రోనాల్డ్‌రోస్

medakసంగారెడ్డి ప్రతినిధిఃజిల్లాలో పదో తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చేందుకు ఉపాధ్యాయులు బాగా పనిచేశారని జిల్లా కలె క్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో మూడోస్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందు కోసం ఉపాధ్యాయులు బాగా పనిచేశారని ప్రశంసించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశా లలు, హాస్టళ్లు, గురుకులాలు మొత్తం 601 ఉండగా మొత్తం విద్యార్థులు 31,003 మంది పరీక్షలు రాశారన్నారు. ఇందులో 27,425 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 90.74 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 148 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధిం చినట్లు చెప్పారు. 28 గురుకుల పాఠశాలల్లో 1,911 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1,845 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 26 మోడల్ స్కూళ్లలో 1,757 మంది పరీక్షలు రాస్తే 1,687 మంది పాసయ్యారని, 43 కెజిబివి పాఠశాలల్లో 1,377 మంది పరీక్షలు రాయగా, 1,254 మంది ఉత్తీర్ణులయ్యారు. 475 జెడ్పి పాఠశాలల్లో 23,878 మంది పరీ క్షలు రాస్తే 20,992 మంది పాస య్యారని, 25 ప్రభుత్వ పాఠశాలల్లో 1,861 మంది పరీక్షలు రాయగా 1,456 మంది, 4 ఎయిడె డ్ పాఠశాలల్లో 219 మంది పరీక్షలు రాస్తే 191 మంది ఉత్తీర్ణులయ్యారని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఆర్విఎం పిఓ యాస్మిన్‌భాష, డిఇఓ నజీమొద్దీన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.