Search
Monday 24 September 2018
  • :
  • :

రాజమౌళి నెక్ట్స్ మూవీ ఎవరితో?

Rajamouli

రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని నిర్మాత డి.వి.వి.దానయ్యతో చేస్తాడని తెలిసింది. ఎప్పుడో దానయ్యకి కమిట్‌మెంట్ ఇవ్వడం వల్ల దాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు ఈ స్టార్ డైరెక్టర్. అయితే నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనేది రాజమౌళి ఇంకా నిర్ణయించుకోలేదు. గ్రాఫిక్స్ అవసరం లేని చిత్రం చేస్తానని మీడియాతో చెప్పాడు. కానీ ఇంకా దానిపై రాజమౌళికి క్లారిటీ లేదు. అలాగే ఈ చిత్రం ఎవరితో చేయాలనేది కూడా అతను నిర్ణయించుకోలేదు. కథకు అనుగుణంగా హీరో ఎవరనేది నిర్ణయించే స్వంతంత్రం తనకి ఉంది. కానీ వారి డేట్స్ సంపాదించడం దానయ్యకు కుదురుతుందా లేదా అనేది చూడాలి. ఆయన దగ్గర ప్రస్తుతం ముగ్గురు హీరోల డేట్స్ ఉన్నాయి. మహేశ్, ఎన్‌టిఆర్, అఖిల్‌తో దానయ్యకి కమిట్‌మెంట్స్ ఉన్నట్టు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరినైనా రాజమౌళి ఎంచుకుంటాడా లేక వేరే హీరోతో వెళ్తాడా అనేది చూడాలి. ఇక మహేష్, ఎన్టీఆర్ ఇద్దరికీ మాట ఇచ్చిన రాజమౌళికి అది నెలబెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. అఖిల్‌తో కూడా అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి నెక్స్ మూవీ ఎవరితో అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Comments

comments