Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సాక్షర భారత్ ఉద్యోగుల పోరుబాట

Witness India employees fight

కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న దీక్షలు
పదవ రోజుకు చేరినా పట్టించుకోని అధికారులు
డిమాండ్‌లపై ఎంఎల్‌సికి వినతి పత్రం
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి : సాక్షర భారత్ పథకంలో పని చేసే ఉద్యోగులు తమ డిమాండ్‌ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లపై స్పందించి ఆమోదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కలెక్టరేట్ ముందు రిలే దీక్షలను ప్రారంభించి శనివారం నాటికి పదవ రోజుకు చేరుకున్నా ప్రజా పత్రినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. శనివారం సాక్షర భారత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఎంఎల్‌సి పురాణం సతీష్ వెళ్లారు. ఈమేరకు మండల, గ్రామ సమన్వయ కర్తలు తమకు ఉద్యోగ భద్రత, ఉద్యోగాల క్రమబద్దీకరణ, వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు అందజేయాలనే తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈమేరకు స్పందించిన ఎంఎల్‌సి పురాణం సతీష్ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

సాక్షర భారత్‌పై నీలినీడలు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాక్షరభాతర్ కార్యక్రమంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్నరాష్ట్రాల్లో వయోజన విద్యాశాఖ ద్వారా సాక్షరభారత్ పథకంలో వమోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కేంద్ర ప్రవేశవెట్టింది. గత ఏడేళ్లు ఆయా జిల్లాల్లో అమలు అవుతున్న సాక్షరభారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటి వరకు ఈ పథకంలో స్వచ్చంద కార్యకర్తలుగా తక్కువ వేతనాలతో ఏడు సంవత్సరాలుగా అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సర్వేలు, తదితర కార్యక్రమాల అమలులో ఎంసిఓలు, విసిఓలు సేవలను అందించారు. మంచిర్యాల జిల్లాలో 210 సాక్షరభారత్ కేంద్రాలు ఉండగా 420 మంది గ్రామ సమన్వయ కర్తలు , 14 మంది మండల సమన్వయ కర్తలు పని చేస్తున్నారు. సాక్షరభారత్ కార్యక్రమం లక్షాలు భాగానే ఉన్నప్పటికీ కేంద్రం ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా గత ఏడాది కాలంగా సిబ్బందికి వేతనాలు అందడం లేదు. నిధుల కేటాయింపు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహణను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే పలు చోట్ల కేంద్రాలు మూత పడ్డాయి.మండలానికి ఒక సమన్వయ కర్త,పంచాయతీకి ఇద్దరి చొప్పున సమన్వయ కార్యకర్తలను నియమించారు. మండల సమన్వయ కర్తలకు ప్రతి నెల రూ. 6 వేలు , గ్రామసమన్వయ కర్తకు రూ 2 వేల చొప్పున గతంలో వేతనాలు చెల్లించారు. అయితే ఈపథకం నిర్వాహణకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఏర్పాటు చేయకపోవడం వలన సమన్వయకర్తలకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ పథకానికి నిధులు విడుదల చేసి, ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించాలని వారు కోరుతున్నారు.

Comments

comments