Home వికారాబాద్ వాహ్ … అనంతగిరి

వాహ్ … అనంతగిరి

GUHALU

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలపై తాతాల నాటి గుహాలున్నాయి. ఈ గుహాల్లో రుషులు తపస్సు చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పురాత దేవాలయమైన శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం పక్కనే ఈ గుహలున్నాయి. దేవాలయం కింది భాగంలో కోనేరు ఉంది.

కోనేరు దేవాలయం మధ్యలో గుహలుండి పర్యాటకులకు కను ందు చేస్తున్నాయి. ఒకే శిల వెయ్యి గజాలపైనే విస్తరించి ఉంది. ఈ శిలనే గుహలుగా మార్చుకున్నారు.  రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సంవత్సరాల నాటి శిలాజలు కనిపిస్తాయి. అనంతగిరి దేవాలయం పక్కనే ఉన్న వేయి గజాల పైనే విస్తరించి ఉన్న శిలాజం వందల నాటి సంవత్సరాల నాటిదిగా చెప్పుకుంటారు. ఈ శిలాజం ను అప్పట్లో ఇక్కడ నివసించేవారు వారికి అనుకూలంగా కొండ గుహలుగా మలచుకున్నారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్కనే ఉన్న ఈ కొండ గుహలతో అనంతగిరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఇవి ప్రాచీన కాలం నాటివిగా ఇక్కడి వారు చెప్పుతున్నారు. సుమారుగా 18వ శతాబ్దం నాటివిగా వారు పేర్కొంటున్నారు. వికారాబాద్ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయ సమీపంలో ఈ గుహలుండటంతో పర్యాటకులకు బాగా ఆకట్టుకుంటు న్నాయి. ప్రతి సంవత్సరం రెండు సార్లు జరిగే జాతరలో పాల్గొనే భక్తులు ఈ గుహల్లో రెండు మూడు రోజులు నివాసం ఉంటున్నారు. అనంతగిరి గుట్టుపై సుమారుగా 20 వరకు గుహలున్నాయి.

దేవాలయ అభివృద్దిలో భాగంగా ఈ గుహలను మరమ్మత్తులు చేయించారు. ఈ గుహలోని ఒక గుహకు మార్కెండేయ తపోవనంగా పేరును పెట్టారు. మార్కండే యుడు తపస్సు స్థలం ఇదే అని అందుకే  ఈ గుహాకు ఆ పేరును పెట్టామని ఇక్కడి వారు పేర్కొంటారు.  ఈ గుహలో  మార్కెండేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవటానికి వచ్చిన భక్తులు ఈ గుహల్లో ప్రతిష్టించిన మార్కెండే యున్ని దర్శించుకుంటారు. ఈ గుహల చరిత్రను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలను తీశారు. నెలకొకసారి ఇక్కడ ఎదో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమాలే కాకుండా టి.వి. సీరియల్స్, హిందీ చలన చిత్రాలను కూడా ఇక్కడ షూటింగ్ జరుపుతున్నారు. ఎంతో బాగున్నా గుహలను చూసి వీటి చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఇక్కడ ఎవరూ సమాచారాన్ని ఇవ్వటం లేదు. దీంతో వీటి గురించి తెలియక వారు నిరాశకు గురవుతున్నారు. వీటి సమాచారాన్ని తెలుపుతూ ఇక్కడ బోర్డులు ఏర్పాటుకు దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.