Home జాతీయ వార్తలు బీహార్‌లో దారుణం..!

బీహార్‌లో దారుణం..!

Woman And Daughter Gang-Raped At Gunpoint As Husband Was Tied To Tree

పాట్నా: బీహార్‌లో మరో దారుణం జరిగింది. 20 మంది దుండగులు భర్తను చెట్టుకు కట్టేసి ఆపై భార్య, కూతురిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బీహార్‌లోని గయాలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… గయాలోని గురారు బజార్‌లో ఓ వైద్యుడు ప్రవేటు ఆస్పత్రి నడుపుతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన క్లినిక్‌ను మూసివేసి భార్య, కూతురి(12)తో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే మార్గంమధ్యలో మారణాయుధాలు కలిగిన 20 మంది వారిని అడ్డుకున్నారు. అనంతరం వైద్యుడిని ఓ చెట్టుకు కట్టేసి తుపాకీతో బెదిరించి అతడి కళ్లముందే తల్లీకూతుళ్లపై వారు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 17 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.