Home జాతీయ వార్తలు చెల్లి ప్రాణాలు తీసిన అక్క అక్రమ సంబంధం

చెల్లి ప్రాణాలు తీసిన అక్క అక్రమ సంబంధం

Dead Body

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. కాపుర్ ఘర్ గ్రామంలో అక్క అక్రమ సంబంధానికి చెల్లి అడ్డుతగులుతుండడంతో చెల్లిని హత్య చేయించింది అక్క. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాజల్, హిమాన్షి అనే ఇద్దరు అక్కచెల్లెలు ఉండేవారు. మోహిత్, భరత్ వీర్ అనే వ్యక్తులతో అక్క కాజల్ అక్రమ సంబంధపెట్టుకుంది. దీంతో హిమాన్షి పలుమార్లు అక్కను మందలించడంతో తన చెల్లెలను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. మోహిత్, భరత్ తో కలిసి చెల్లెను చంపేసింది. అనంతరం తన చెల్లెలు కనిపించడం లేదని తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు కాజల్ పై అనుమానం రావడంతో తనదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు మోహిత్, భరత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

 

Woman Arrested for Killing Sister in Uttar Pradesh

 

 

 
Woman Arrested for Killing 12 Year Old Sister in UP