Search
Saturday 22 September 2018
  • :
  • :

సమాజ శ్రేయస్సులో మహిళా సమాఖ్యల పాత్ర కీలకం

WOMAN

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : సమాజ శ్రేయస్సు కోసం మహిళా సమాఖ్యలు పనిచేసి మార్పు తీసుకు రావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్‌కణ్ణన్ పేర్కొన్నారు. శుక్రవారం మినీ సమావేశ మందిరంలో స్త్రీ నిధి సమీక్ష సమావేశం ఆయన పాల్గొని మాట్లాడారు. స్త్రీ నిధి నుంచి ఇచ్చే రుణాలు ఎక్కువ శాతం విద్యా, ఆరోగ్యం, వివాహాలకు ఇవ్వాలని అన్నారు. అవసరమున్న అందరికీ రుణాన్ని ఇస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షిం చుకోవాలని అన్నారు.

గత సంవత్సరంలో స్త్రీ నిధి క్రింద రుణం తీసుకొని గేదెలు కొనుక్కొన్న వారు పాలు ఎవరికి అమ్ముతున్నారు. వాటికి ఏదైన డిమాండ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అససరం లేని చోట్ల రుణాలు ఇవ్వకూడదన్నారు. రుణం ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని, అంతే గాకుండా వారికి సకాలంలో అందేలా చూడాలన్నారు. స్త్రీ నిధి మహిళలు తమ చుట్టు ఉన్న సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి మేమున్నామని అండ నివ్వాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

\గ్రేడింగ్ ఏడాది కొకసారి కాకుండా ప్రతి మూడు నెలలకోసారి జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 48 శాతం మహిళలు విద్యా వంతులుగా ఉన్నారని ఆయన తెతెలిపారు. ఇటువంటి నేపథ్యంలో చిన్న చిన్న అవసరాలకు ప్రజలు రుణం కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించడం సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు విద్యావంతులై నందున వారి చుట్టు ఉండే సమాజాన్ని చైతన్యవంతులను చేసి అధిక వడ్డీలు కట్టే ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగ పర్చుకొని తమ ఆర్థిక పరిపుష్టికి కృషిచేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్‌డిఒ అరుణ, డిపిఒ వెంకటేశ్వర్లు, ఎపిఎంలు, వీఎల్‌ఇలు, మహిళా సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments