Home తాజా వార్తలు వరంగల్‌లో మహిళ దారుణ హత్య

వరంగల్‌లో మహిళ దారుణ హత్య

murdered

వరంగల్ రూరల్: జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అతి కిరాతకంగా హతమార్చారు. మృతురాలిని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన పఠాని సలీమా(27)గా గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.