Search
Friday 21 September 2018
  • :
  • :

నోట్ 7 కంటే నేనేం తక్కువ : ఐఫోన్ 7..!

I-Phone-7-Blastమెల్‌బోర్న్ : గెల్సాక్సీ నోట్ 7 కొద్ది రోజుల క్రితం వరకు మొబైల్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నోట్ 7 కొన్నవారైతే.. అది ఎప్పుడు పేలిపోతుందో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఐఫోన్ 7…. నోట్ 7 కంటే నేనేం తక్కువ కాదంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ సంఘటనే.. కొత్తగా కొన్న ఐఫోన్-7ను ఛార్జింగ్ పెట్టగా అది కాలిపోయింది. మెల్‌బోర్న్ కు చెందిన మెలెనీ టాన్ పీలెజ్‌కు ఐఫోన్ మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఇచ్చింది. ఐఫోన్‌ను చార్జింగ్ పెట్టి ఆమె పడుకుంది. ఒక్కసారిగా తీవ్రంగా నొప్పిగా ఉండటంతో లేచి చూసింది. తన ఫోన్ కాలిపోవడంతో ఆమె చేతికి తీవ్రంగా గాయమైంది. జరిగిన సంఘటనను సదరు మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో పాటు ఐఫోన్ వల్ల తన చేతికి జరిగిన గాయాన్ని ఫోటో తీసి ఫోస్ట్ చేసింది. పడుకునేప్పుడు ఫోన్‌లను దూరంగా పెట్టాలని, ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టి ఎంతమాత్రం వాడటం, పక్కనపెట్టుకోవడం మంచిది కాదని సూచించింది. ఈ ఫోస్ట్ కొద్ది సమయంలోనే ఫేస్‌బుక్‌లో సంచలనమైంది. దీంతో ఐఫోన్-7 కూడా నోట్-7కు ఎంత మాత్రం తక్కువ కాదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Comments

comments