Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పోలీస్‌స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

Suicide

పెద్దపల్లి: కేసు దర్యాప్తులో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నార ని ఆరోపిస్తూ పెద్దపల్లి జి ల్లా ధర్మారం మండల కేం ద్రానికి చెందిన మోతనప ల్లి అంజలి అనే యువతి శ నివారం పెద్దపల్లి పోలీస్‌స్టే షన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం కరీంనగర్ అసుప త్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారంకు మోతనపల్లి అంజలి అనే యువతి 12 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే దళి త యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటినుంచి పుట్టింటి వైపు కన్నె త్తి చూడని అంజలి 4 నెలల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆస్తిలో తనకు రావాల్సిన వాటా గురించి అడగడంతో గొడవ జరిగింది.

అనంతరం పెద్దమను షుల సమక్షంలో పంచాయతీ జరగ్గా అంజలి తల్లి, ఇద్దరు చెల్లెల్లు తన అత్త మోతనపల్లి రాజమ్మను కులం పేరుతో దూషించారని ధర్మారం పోలీస్‌స్టేషన్ లో ఫిబ్రవరి 13న రాజమ్మ పేరుతో ఫిర్యదు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి కేసు పెట్టి నెలన్నర దాటి నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తన తల్లిని, చెల్లెల్లను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ అంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అంజలి అత్త మోతనపల్లి రాజమ్మ పెట్టిన ఎస్‌సి, ఎస్‌టి కేసులో పోలీసు లు ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని పెద్దపల్లి ఎసిపి సిందూ శర్మ అన్నారు.

గడిచిన ఫిబ్రవరి 13 మోతనపల్లి రాజమ్మ తన కోడలు తల్లి ఇద్దరు చెల్లెల్లైన కుందారపు హైమవతి , కుందారపు లక్ష్మీప్రసన్న, కుందారపు నాగమణి కులం పేరుతో దూషించారని, ఎస్‌సి, ఎస్‌టి కేసు పెట్టిందని అన్నారు. తాము అదేరో జూ ముగ్గురిపై 23/73 ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసిపి తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి చార్జిషీట్ వేసే దశలో పిపి ఒపీనియ న్‌కు పంపామని, వారంలో కేసు పూర్తవుతున్న దశలో అంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు.

Comments

comments