Home జాతీయ వార్తలు కీచక ఖాకీ వేధింపులతో మహిళ సూసైడ్.!

కీచక ఖాకీ వేధింపులతో మహిళ సూసైడ్.!

Woman commits suicide after cop harass in Tamilnadu

చెన్నై: పౌరులకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ కామంతో కళ్లుమూసుకుపోయి పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఆమె పెద్ద కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేయడంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… స్థానిక వాలాజా సమీపంలోని మేల్‌పుదుపేటకు చెందిన మహిళ (36) భర్తతో విభేధాల నేపథ్యంలో తన ఇద్దరు కూతుళ్లతో కలసి వేరుగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు చెన్నైలో పనిచేస్తున్న కావేరిపాక్కంకు చెందిన పోలీసు అధికారితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో తరచూ మహిళ ఇంటికి వచ్చే అతగాడు ఆమె పెద్ద కూతురిపై కన్నేశాడు. ఆ కీచక ఖాకీ కూతురిని తనకిచ్చి వివాహం చేయాలని గత కొంతకాలంగా మహిళను వేధిస్తున్నాడు. దాంతో సదరు మహిళ పోలీసును దూరం పెడుతు వస్తోంది. కానీ, అతడు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. వీలు దొరికినప్పుడల్లా ఇంటికి వచ్చి ఆమె కుమార్తెను వివాహం చేసుకుంటానని బలవంతం పెట్టడంతో మనస్తాపం చెందిన మహిళ బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతుళ్ల ఫిర్యాదు మేరకు వాలాజా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఖాకీ చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Woman commits suicide after cop harass in Tamilnadu.

Telangana Breaking News