Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నటుడు బాలాజీపై ఫిర్యాదు..!

Woman Complaint against Actor Balaji in Jubilee Hills PS

హైదరాబాద్: సినీ, బుల్లితెర నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ భార్యకు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో యూసుఫ్‌గూడ పరిధిలోని యాదగిరి నగర్‌లో నివాసించే భాగ్యలక్ష్మీ అనే మహిళను సంప్రదించాడు. దాంతో ఆమె కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించింది. ఆ సమయంలో లక్ష్మీకి బాలాజీ రూ. 20 లక్షలు ఇస్తానని చెప్పి తొలుత రూ. 3 లక్షలు ఇచ్చాడు. ఆపరేషన్ అనంతరం మిగిలిన డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఆ తరువాత డబ్బులు ఇవ్వకపోగా, ఆమెను దూషిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో చేసేదేమిలేక లక్ష్మీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు బాసటగా సినీనటి శ్రీరెడ్డి వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీలను పోలీసులకు సమర్పించాడు. శ్రీ రెడ్డి మాట్లాడుతూ… లక్ష్మికి న్యాయం జరిగేవరకు తాను అండగా ఉంటానన్నారు. బాధల్లో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆమెకు డబ్బులు చెల్లించినట్లు బాలాజీ చూపిస్తున్న పత్రాలు నమ్మదగ్గవిగా లేవన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments