Search
Wednesday 21 November 2018
  • :
  • :

కారు ఢీకొని మహిళ మృతి

Woman dead by car accident

సత్తుపల్లి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని కిష్టారం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేంసూరుకు చెందిన మైసాక్షి వెంకటేశ్వరరావు, జయలక్ష్మీ దంపతులు వనవడు లక్ష్మీహరిప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనం పై పెనుబల్లి మండలంలోని నీలాద్రి ఆలయానికి వెళ్లారు. అక్కడ నుండి ప్రయాణంలో కిష్టారం గ్రామ శివారులోని కొమ్మేపల్లి మీదుగా వేంసూరు వెళ్ళేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జయలక్ష్మీ తలకు, కాలుకు తీవ్ర గాయాలు కాగా వెంకటేశ్వరరావుకు కాలు విరిగింది. 108 సిబ్బంది క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతి చెందింది. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.  వెంకటేశ్వరరావుకు సత్తుపల్లిలోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మనవడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగానే ఉన్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకొన్న ఎస్‌ఐ ఎన్.నరేశ్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కారు ఓనరును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments