Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మరుగుదొడ్డిలో ప్రసవం

Woman Delivery in the Toilet at Sirisilla

రాజన్న సిరిసిల్ల : పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో ప్రసవించింది. ఈ ఘటన సిరిసిల్లలో సోమవారం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అయితే నెలలు నిండనందున ప్రసవం చేయలేమని, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆస్పత్రి వైద్యులు ఆమెకు సూచించారు. ఈ క్రమంలో ఆమె మరుగుదొడ్డిలో ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆస్పత్రి వైద్యుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.

Woman Delivery in the Toilet at Sirisilla

Comments

comments