Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అదనపు కట్నం వేదింపులకు మహిళ మృతి…

woman died of extra dowry  harassument

దహెగాం : వరకట్న వేదింపులకు మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని బీబ్రా గ్రామంలో చోటుచేసుకుంది. బీబ్రా గ్రామంకు చెందిన చకినాల పావణి (22) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్టు కౌటల సిఐ మోహన్, దహెగాం ఎఎస్ఐ మల్లేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవాజిగుడేం గ్రామంకు చెందిన పావణికి బీబ్రా గ్రామంకు చెందిన చకినాల చంద్రశేఖర్‌కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాహం జరిగిన తర్వత సజావుగా కాపురం జరిగింది. తర్వత వరకట్నం కోసం వేదించడంతో పెద్ద మనుష్యుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చేప్పినట్టు తెలిపారు. ఆదివారం చంద్రశేఖర్ పావణి తండ్రి పోతరాజుల లచ్చయ్యకు ఫోన్ చేసి నీ కూతురు మంచిగా లేదని వారికి తెలియజేశారు. అప్పటికే మృతి చెందినట్టు పావణి మెడపై గాయాలు ఉన్నట్లు అదనపు కట్నం కోసం తన కూతురిని అత్తింటివారు వేదించి హత్య చేశారని పావణి తండ్రి పొతరాజుల లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పావణి భర్త చకినాల చంద్రశేఖర్, అత్త అమ్మక్క, మామ సుధాకర్ లపై కేసు నమోదు చేసినట్టు సిఐ మోహన్ తెలిపారు.

Comments

comments