Search
Thursday 15 November 2018
  • :
  • :

చికిత్స పొందుతూ మహిళ మృతి

Woman died while Osmania is being treated at the hospital
కాచిగూడ : చికిత్స పొందుతు గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఇన్ స్పెక్టర్ డి. విజయ్‌లాల్ తెలిపిన వివరాల ప్రకారం… గుర్తు తెలియని మహిళ (60) గత నెల 28వ తేదీన పట్టాలు దాటుచుండగా ఎంఎంటిఎస్ రైలు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్ ఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకి తరలించారు. చికిత్స పొందుతు గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలు ఛామనచాయ, గుండ్రటి మోఖము, మెరున్ కలర్, పుల జుబ్బ పైజామ్ ధరించి ఉంది. సంబంధికులు ఎవరైన ఉంటే కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments