Home తాజా వార్తలు మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం… మహిళ మృతి

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం… మహిళ మృతి

Road Accident

ఘట్ కేసర్: కారు టాటా ఏస్ ఢీకొన్న ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్  ఔంటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న రమాదేవి అనే మహిళ మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాద సమయంలో కారులో 7గురు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో టాటా ఏస్ డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Woman Dies In Road accident At Ghatkesar