Search
Monday 24 September 2018
  • :
  • :

తుకారాంగేట్ పరిధిలో యువతి అదృశ్యం ..

Woman Missing at Shamshabad Airport

హైదరాబాద్: నగరంలో ఓ యువతి అదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… అడ్డగుట్ట చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్నగౌసియా సుల్తానా(20)  ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళింది. రాత్రి వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది యువతికి ఫోన్ చేశారు.  ఫోన్ కలవలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. అయిన ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Comments

comments