Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఫ్లైట్‌లో ప్రయాణికురాలి పాడు పని..!(వీడియో)

Woman-drying-underwear-on-p

మాస్కో: ఇటీవల విమానంలో కొందరు ప్రయాణికుల వింత ప్రవర్తనలు తోటి ప్రయాణికులకు కొంత ఇబ్బందికరంగాను, అదే సమయంలో నోరెళ్లబెట్టేలాను చేస్తున్నాయి. అప్పటి వరకు బుద్ధిమంతుల్లా ఉన్నవారు అదేదో పూనకం వచ్చిన్నట్లు ఒక్కసారిగా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెడతారు. తాజాగా ఓ ప్రయాణికురాలు విమానంలో చేసిన పని తోటి ప్రయాణికులను షాక్‌కు గురి చేసింది. ఛీ.. ఛీ ఇదేం పాడు పని అని వారిని నోరెళ్లబెట్టేలా చేసిందట. ఇంతకి ఆమె చేసిన పనేంటో తెలుసా… బ్యాగ్‌లో నుంచి అండర్‌వేర్‌ను బయటకు తీసి సీటు పైన ఉన్న ఎసి గాలి తగిలేలా దాన్ని ఎత్తి పట్టుకొని ఆరబెట్టింది. ఇది చూసిన ప్రయాణికులందరూ షాకయ్యారట. ఇదేం పని అంటూ బిత్తరపోవడం వారి వంతైంది. అయినా ఇదేమి పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసుకుంది. అయితే వెనుక సీట్లో కూర్చొన్న ఓ ప్రయాణికుడి దీనిని వీడియో తీశాడు. అనంతరం ఫ్లైట్ దిగాక ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చాడు. వెబ్‌సైట్ వాళ్లు ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు వెళ్తున్న యూరల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

comments