Home జాతీయ వార్తలు క్యూలో మాజీ ప్రియుడు.. ఫ్యామిలీని పిలిచి చితక్కొట్టించింది!

క్యూలో మాజీ ప్రియుడు.. ఫ్యామిలీని పిలిచి చితక్కొట్టించింది!

People-Beatingనాసిక్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం దేశ ప్రజలంతా బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే ఈ క్యూలలో కూడా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు ఈ క్యూ లైన్లలో కలిసి మిత్రులు అవుతుండగా… మరికొందరు డబ్బు కోసం దాడులు చేసుకుంటున్నారు.

కాగా మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఓ బ్యాంకు వద్ద ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. నాసిక్‌లోని త్రయంబక్ రోడ్డులోని బ్యాంకు వద్ద ఓ యువతి క్యూలో నిలుచుంది. కాగా ఆ క్యూలో ఆమె మాజీ ప్రియుడు కనిపించాడు. అతన్ని చూసిన వెంటనే ఆగ్రహం ఆపులేక ఆమె తన తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి పిలిచింది. బ్యాంకు పనిని పక్కకు పెట్టి అందరూ చూస్తుండగానే ముగ్గురు కలిసి సదరు యువకుడిని చావకొట్టారు. తిరిగి అతడిపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఒంటి నిండా గాయాలతో ఉన్న యువకుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిపై ఐపిసి 323, 504, 560 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.