Search
Monday 24 September 2018
  • :
  • :

బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో బెదిరించి… ఆపై అత్యాచారం

girl-frind-forced
మోంటానా: ప్రియుడితో భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయిన ఓ ప్రియురాలు అతడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…  సమంతా మియర్స్, బాధిత యువకుడు కొన్ని సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా మెలిగారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల రావడంతో ఇటీవల ఇద్దరు విడిపోయారు. అయితే, సమంతా మియర్స్ తన మాజీ ప్రియుడి ఇంట్లోకి ప్రవేశించింది. అంతేకాకుండా అతడి గొంతుపై కత్తిపెట్టి బెదిరించింది. అతడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతని చేతిని గట్టిగా కొరికీ…. అత్యాచారానికి పాల్పడిందని బాధితుడు వాపోయాడు. అతడు గట్టిగా కేకలు వేయడంతో  అక్కడి నుంచి పారిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మియర్స్‌ను అరెస్ట్ చేసి, విచారించగా…. ఆమె వాదన మరో విధంగా ఉంది. అతడే తనను ఇంటికి ఆహ్వానించి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదును కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. బాధితుడి చేయిపై  కొరికిన గాయం గుర్తులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Comments

comments