Home జాతీయ వార్తలు యుపిలో దారుణం…

యుపిలో దారుణం…

IndiaTv3914ee_GangRape

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు తన కూతురిని ప్రేమించి తీసుకెళ్లి పోయాడని ఆగ్రహించిన అమ్మాయి కుటుంబీకులు అబ్బాయి తల్లిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. యుపి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాష్ట్రంలోని షామ్లి జిల్లా బోపురా గ్రామంలో ఉండే యువకుడు ముజఫర్ నగర్‌కు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వారు ఘజియాబాద్‌లోని ఓ కళాశాలలో చదువుతున్నారు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించాడు. దీంతో యువకుడు, యువతి నవంబర్ 20న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దాంతో యువకుడి కుటుంబంపై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు దాడికి యత్నించారు. అనంతరం ఈ నెల 25న రాత్రి వేళ యువతి తండ్రి, సోదరుడు, బావాతో కలిసి మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో యువకుడి తల్లిపై యువతి తండ్రితో పాటు మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్‌పి అజయ్ పాల్ శర్మ తెలిపారు.

Woman Gang Raped after her son Elopes with His Lover.