Search
Friday 16 November 2018
  • :
  • :

కెనడాలో భారతీయుడిపై జాత్యహంకార వ్యాఖ్యలు

woman give racist comments to indian in canada

టొరంటో : “పాకీవోడా…అశుద్ధపు మొఖం వోడా, నీ దేశం వెళ్లిపోరా”అనే సూటిపోటి మాటలతో కెనడాలోని భారతీయుడు రాహుల్ కుమార్‌కు తీవ్రమైన అవమానం ఎదురైంది. జాత్యహంకారం, అంతకు మించి వర్ణ వివక్షతను చాటుకుంటూ కెనడాకు చెందిన తెల్ల మహిళ దురహంకారం ప్రదర్శించింది. కేవలం కారు పార్కింగ్ విషయాన్ని తీసుకుని ఆ మహిళ బూతులకు దిగిన వైనం ఇప్పుడు రాహుల్ కుమార్ సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోతో వెలుగులోకి వచ్చింది. రాహుల్ కుమార్ ఏడేండ్ల క్రితం కెనడాకు వచ్చాడు. తన ఇంటి వెలుపలనే తన పిల్లల సమక్షంలోనే తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని కుమిలిపోతున్నాడు. ఆయన ప్రదర్శించిన వీడియోలో ఈ మహిళ దురహంకారం పూర్తిగా వెల్లడైంది. పాకీ ఇక్కడ నీకేం పని,,మీ దేశానికి పో అంటూ నువ్వు ఎంతగా సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకున్నా నిన్ను పాకి అని పిలుస్తానని అంటూ ఈ మహిళ రెచ్చిపోయింది.

పైగా చెత్త చర్మపు రంగోడా అని కూడా తిట్టిందని ఇప్పుడు ఈ దృశ్యాలను సిటివీ న్యూస్ ప్రసారం చేసింది. తరువాత దీనిపై ఆమె వార్తా సంస్థ వారితో మాట్లాడుతూ తాను జాత్యాహంకారిని కాదని దబాయించింది. పార్కింగ్ వివాదాన్ని సాకుగా తీసుకుని తిట్టిపోస్తారా? అని అడగగా అది న్యాయమా? కాదా అనే వాటి జోలికి తాను పోవడం లేదని, ఆ క్షణంలో ఆ విధంగా అన్నాను, ఏదైనా జరిగితే ఎదుర్కొంటానని కూడా తెలిపింది. తాను చేసినదానికి తాను చింతించాల్సిన పనిలేదని కూడా తెలిపింది. ఏ సమస్య వచ్చినా పెద్దగా పట్టించుకోనని ధీమా వ్యక్తం చేసింది. రాహుల్ యాసను అవహేళన చేస్తూ ఆ ఈస్టిండియన్ పాకి అని సంబోధించింది. ఇప్పటికైనా ఈ వ్యక్తి దేశం విడిచి పోవాలని అరిచింది. ఆ మహిళ తాను వెళ్లుతూ వెళ్లుతూ ఈ యువకుడి కారుపై పెద్దగా ఉమ్మేస్తూ , చేతకాని వెధవ అని వ్యాఖ్యానించింది. ఈ మహిళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో రాహుల్ ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు.

జీవితంలో తనకు ఇప్పటివరకూ ఇటువంటి చేదు అనుభవం ఎదురుకాలేదని తెలిపాడు. ఈ మహిళ దురుసు మాటలకు దిగడం, అందులోనూ అక్కడనే తన పిల్లలు కూడా ఉండటంతో తాను మరింతగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఎవరి జీవితంలో అయినా ఇంతకంటే షాక్ మరోటి ఉండదని చెప్పాడు. కెనడాలో గత నెలలోనే భారతీయ సంతతి దంపతులను శ్వేతజాతీయుడు తీవ్రంగా వేధించాడు. దేశం విడిచి పెట్టి వెళ్లాలని లేకపోతే వారి పిల్లలను చంపివేస్తానని బెదరించాడు. ఇప్పుడు కెనడాలోనే మరో భారతీయుడు భరించలేని అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది.

 

Comments

comments