Home తాజా వార్తలు ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం..

ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం..

హైదరాబాద్: ఒకే కాన్పులో మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చిన సంఘటన హైదరాబాద్ లోని చిలకలగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిలకలగూడ గీతానర్సింగ్‌ హోంలో హేమలత, లక్ష్మణ్‌ దంపతులకు ఒకే కాన్పులో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. మహిళకు నల్లకుంటలోని బిబిసి ఆసుపత్రికి చెందిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు.తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఏప్రిల్ 2న మహిళ నలుగురు శిశువులు జన్మనివ్వగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Woman Gives Birth to 4 Babies at One time in Chilakalaguda