Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అందంగా లేవన్నందుకు.. వివాహిత ఘాతుకం!

Woman held for poisoning food at family function in Maharashtra

ముంబయి: అందంగా లేవని, వంట చేయడం సరిగ్గా రాదని ఎగతాళి చేసిన బంధువులపై కక్షపెంచుకుని దారుణానికి ఒడిగట్టిన ఓ వివాహిత ఉదంతమిది. ఏకంగా ఓ వేడుకలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపేసింది. దాంతో నలుగురు చిన్నారులతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. మరో 120 మంది వరకు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానుష ఘటన మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్‌లో చోటుచేసుకుంది. గత సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం… మహద్ ప్రాంతానికి చెందిన ప్రగ్యా సర్వేష్‌కు రెండేళ్లక్రితం వివాహమైంది. అయితే ప్రగ్యా అందహీనంగా ఉండటంతో బంధువులు తరచూ ఆమెను ఆటపట్టించేవారు. దీన్ని తీవ్రంగా భావించిన ఆమె దారుణానికి పాల్పడింది. ఈ నెల 18న సమీప బంధువు సుభాష్ మనె ఇంట ఓ శుభకార్యం జరిగింది. దీంతో బంధువుల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక గత కొంతకాలంగా బంధువుల వెక్కిరింతలతో విసిగెత్తిన ప్రగ్యా వేడుక కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపేసింది. అది తిన్న వారిలో నలుగురు చిన్నారులతో పాటు ఓ వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయారు. మరో 120 మంది అస్వస్థతతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విచారణలో ప్రగ్యా ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు

Comments

comments