Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మద్యంమత్తులో మహిళ హల్ చల్

మద్యంమత్తులో మహిళ హల్ చల్

Womanహైదరాబాద్ : మద్యం మత్తులో ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో రచ్చరచ్చ  చేసింది. పోలీసులనే బావా … బావా.. అంటూ హల్ చల్ చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పాలకొల్లుకు చెందిన లక్ష్మి (45) బతుకుదెరువు కోసం గురువారం ఉదయం హైదరాబాద్ కు వచ్చింది. గురువారం రాత్రి అతిగా మద్యం తాగిన ఆమె అమీర్‌పేటలోని ఇండో యూఎస్‌ ఆస్పత్రి ముందు అపస్మారక స్థితిలో పడుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన 108 సిబ్బందిని ఆమె దూషించడంతో పాటు దాడికి యత్నించింది. ఈ క్రమంలో 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ ఐ నరేశ్ తన సిబ్బందితో వచ్చి లక్ష్మిని పోలీసు స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లో పోలీసులను బావా…బావా అంటూ లక్ష్మి అసభ్యకరంగా ప్రవర్తించింది. లక్ష్మిని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు తరలించి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా 170 బిఎసి వచ్చింది. లక్ష్మిని గాంధీ ఆస్పత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Hulchul in Hyderabad