Home అంతర్జాతీయ వార్తలు 14 ఏళ్లుగా కోమాలో ఉన్న మహిళకు ప్రసవం!

14 ఏళ్లుగా కోమాలో ఉన్న మహిళకు ప్రసవం!

Woman in Coma

 

ఫీనిక్స్(అరిజోనా): పద్నాలుగేళ్లుగా కోమాలో ఉన్న ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ సంఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఇటీవల జరిగింది. కోమాలో ఉన్న ఒక మహిళపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం నీటిలో కొట్టుకుపోయిన దుర్ఘటనలో ఒక మహిళ కోమాలోకి జారుకుంది. దశాబ్దానికి పైగా ఆమె ఫీనిక్స్‌లోని హసీండా హెల్త్‌కేర్‌లో చికిత్స పొందుతోంది.

ఆమె సంబంధీకులే ఎవరో ఆస్పత్రిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే, బిడ్డ పుట్టేంతవరకు ఆమె గర్భవతి అన్న విషయం కూడా ఆస్పత్రి సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం. కోమాలో ఉన్న ఆ మహిళ నుంచి మూలుగు శబ్దాలు రావడంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించారని, అయితే ఆమె ఎందుకు అలా చేస్తోందో వారికి కూడా అర్థం కాలేదని తెలిసింది. ఆమె బిడ్డ సజీవంగా, ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఆ శిశువును మారికోపా మెడికల్ సెంటర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Woman in Coma Gives Birth, Police Begins Investigation on Alleged Sexual Abuse