Search
Monday 24 September 2018
  • :
  • :

అడవి పంది దాడిలో మహిళ మృతి…

women-killed
జగిత్యాల: జిల్లాలోని మల్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(48) అడవి పందిదాడిలో మృతి చెందింది. వివరాలలోకి వెళితే…అధికారులు, ఉపాధి కూలీల కథనం ప్రకారం… తాటిపెల్లి గ్రామ శివారులోని బోయినిగుట్టకు కండిగ కందకాలను తీసేందుకుగాను 117 మంది ఉపాధీ కూలీలు వెళ్లారు. పనులు చేస్తున్న సమయంలో గుట్టపై అడవి పందులు గుంపుగా రావడంతో కూలీలు అంతా బెదిరిపోయారు.

          ఈ క్రమంలో ఓ అడవి పంది అక్కడే పని, చేస్తున్న మంచాల రాజ్యలక్ష్మి అనే కూలీ మెడపై దాడి చేసింది. ఆమెను రక్షించేందుకు తోటి కూలీలు గడ్డపారతో అడవి పందిని  తరిమి కొట్టారు. గాయపడ్డ రాజ్యలక్ష్మిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి మృతి చెందింది.

Comments

comments