Search
Friday 21 September 2018
  • :
  • :

పోలీసులకు లొంగిపోయిన మహిళా మావోయిస్టు

Nalgonda : Woman Maoist Surrenders before Nalgonda SPనల్లగొండ : మహిళా మావోయిస్టు షేక్ జాన్బీ అలియాస్ కక్క బుజ్జి మంగళవారం జిల్లా ఎస్‌పి రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. 14 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో ఆమె పని చేశారు. ఇటీవల ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కిరణ్ అలియాస్ సువర్ణ రాజును ఆమె పెళ్లి చేసుకున్నారు. 2016లో రాంగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిరణ్ మృతి చెందాడు. బుజ్జిపై రూ.4లక్షల రివార్డు ఉందని ఎస్‌పి రంగనాథ్ తెలిపారు. ఈ రివార్డును ఆమెకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. హింసతో సాధించేది ఏమీ లేదని, అజ్ఞాతవాసం వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన మావోయిస్టులకు సూచించారు.

Woman Maoist Surrenders before Nalgonda SP

Comments

comments