Home హైదరాబాద్ మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

Woman missing is trained in the beauty parlor

చాంద్రాయణగుట్ట : బ్యూటీపార్లర్లో శిక్షణ పొందుతున్న ఒక మహిళ కనిపించకుండా పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్దుల్ ఖరీమ్ భార్య అఫ్రీన్ బేగం (28) కొంత కాలంగా బ్యూటీపార్లర్లో శిక్షణ పొందుతుంది. ఇంట్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జూలై 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు సమీప బస్తీలలో, బంధువుల ఇళ్ళ వద్ద గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.