Search
Tuesday 20 November 2018
  • :
  • :

బాలుడిపై మహిళ లైంగిక దాడి!

Boy

పనాజీ: పదిహేడేళ్ల బాలుడిపై ఇక్కడకి సమీపంలోని మపూసా పట్టణంలో మహిళ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతమిది. జూన్ 7 సెప్టెంబరు 11 మధ్యకాలంలో 29 ఏళ్ల మహిళ తమ కుమారుడిపై లైంగిక దాడి చేసిందంటూ అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని మపూసా పోలీసు స్టేషన్ ఇన్స్‌పెక్టర్ తుషార్ లోత్లికర్ పిటిఐకి తెలిపారు. పోండాలోని తన ఇంటి నుండి బాధిత బాలుడు పారిపోయాడు. అతను సదరు మహిళ ఇంట్లో ఉంటూ మపూసా పట్టణంలోని ఒక పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్నాడు.

ఆమె తన భర్త నుండి విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోందని మరో పోలీసు అధికారి చెప్పారు. అయితే కొద్దిరోజుల కిందట బాధితుడు తన ఇంటికి తిరిగి వెళ్లినప్పటి నుండి వింతగా ప్రవర్తిస్తున్నాడు. దాంతో అతన్ని ఇక్కడికి సమీపంలోని ప్రభుత్వరంగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ హ్యూమన్ బిహేవియర్ (ఐపిహెచ్‌బి)లో కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిందని అతను చెప్పాడు. దాంతో పోస్కో చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు గోవా పిల్లల సంరక్షణ చట్టం కింద ఆమెపై మంగళవారం కేసు నమోదు చేశామని మపూసా పోలీసులు తెలిపారు.

Woman Sexually Assaults 17 Year old Boy in Mapusa town near Panaji.

Comments

comments