Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఈవ్‌టీజర్‌ను చితకబాదిన మహిళ

లక్నో: మహిళలు బయటకు వెళ్లితే చాలు సూటిపోటి మాటలతో పోకిరిలు వేధిస్తున్నారు. బస్టాండ్‌లో నిలబడిన, నడుచుకంటూ రోడ్డు మీద వెళ్లిన పోకిరిలు వేధిస్తున్నారు. ద్విచక్రం వాహనం మీద వెళ్తున్న పోకిరిలు వెంటపడి వేధిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో ఈవ్‌టీజర్‌ను ఓ మహిళ చితకబాదింది. రోజూ మహిళ ఆఫీస్‌కు వెళ్తుంటే వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని వేధింపులు తీవ్రస్థాయిలో ఉండటంతో ఆమె సహనం కోల్పోయి అతనిపై దాడి చేసింది. నడి రోడ్డు మీద కొడితే బుద్ధి రాదని గ్రహించి, నడి రోడ్డు మీద అతని చెంప పగలకొట్టింది. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈవ్‌టీజర్‌ను చితకబాదారు.

Comments

comments