Home తాజా వార్తలు 108లో మహిళ ప్రసవం

108లో మహిళ ప్రసవం

 Woman transmits in 108 Vehicle

 మునిపల్లి : 108 అంబులెన్స్ వాహనంలో ఓ మహిళ ప్రసవం కావడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని మేళసంగం గ్రామానికి చెందిన బోయిని మమత(20) ప్రసవం నిమిత్తం మండల కేంద్రమైన మునిపల్లి కేంద్రాసుపత్రికి వచ్చింది.. ఈమె  ప్రసవం కాదని సంగారెడ్డి జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లాలని స్థానిక వైద్య సిబ్బంది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామ సమీపాన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మునిపల్లి ఆసుపత్రిలో ప్రసవం కాదని, సంగారెడ్డి ఆసుపత్రికి రెఫర్ చేయడం ఏమిటని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఆసుపత్రికి వెళ్లేంత వరకు కాన్పు కావద్దు కదా.. అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాసుపత్రుల్లోనే 100శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యేవిధంగా చూడాలని, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప.. సంగారెడ్డి ఆసుపత్రికి రెఫర్ చేయకూడదని బాధితులు కోరుతున్నారు.