Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రేమ పేరుతో మోసం.. పిండంతో పిఎస్ కు…

Woman went to police station with the fetus bag in UP

లక్నో: ప్రేమ పేరుతో గర్భవతిని చేసి, ఆ తరువాత అబార్షన్ చేయించాడో ప్రబుద్ధుడు. దాంతో తాను మోసపోయానని, అబార్షన్ అయినా ఐదు నెలల పిండంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది బాధితురాలు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. స్థానికంగా ఉండే ఓ యువకుడు బాధితురాలికి ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం యువకుడి చెప్పడంతో పాటు తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అప్పటి నుంచి సదరు యువకుడు ఆమె నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మరోసారి బాధితురాలు యువకుడిపై పెళ్లి ప్రస్తావనతో ఒత్తిడి తేవడంతో గర్భస్రావం మాత్రలు తెచ్చి బలవంతంగా మింగించాడు. దాంతో యువతికి గర్భస్రావం అయింది. తనను పెళ్లి చేసుకోకుండా బలవంతంగా అబార్షన్ చేయించాడని అందుకు సాక్ష్యంగా ఓ కవర్ లో అబార్షన్ అయిన ఐదు నెలల పిండాన్ని పెట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిందామె. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Comments

comments