Home ఆఫ్ బీట్ ఆయువు ఇచ్చిన ఐఫోన్..!

ఆయువు ఇచ్చిన ఐఫోన్..!

iPhone

లాస్‌వెగాస్: అమెరికాలోని క్యాసినో నగరం లాస్‌వెగాస్‌లో స్టీఫెన్ అనే 64 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మ్యాండలే బే హోటల్‌లో జరుగుతున్న సంగీత కచేరిని లక్ష్యంగా చేసుకుని ఉన్మాది కురిపించిన తూటాల వర్షానికి ప్రేక్షకులు పిట్టల్లా నేలకొరిగారు. ఉన్మాది  విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో  తొక్కిసలాట చోటు చేసుకొని భారీ సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ మారణహోమం నుంచి ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది.

దీనికి కారణం ఆమె ఐఫోన్ 7ప్లస్‌ మొబైల్‌. ఆమె ఘటనాస్థలి నుంచి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్లేందుకు ఓ క్యాబ్ ఎక్కింది. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమె ఫోన్ కు బుల్లెట్ తగిలి ఉండటం చూశాడు. దాంతో ఆమె జరిగిన విషయం క్యాబ్ డ్రైవర్ కు చెప్పింది. బుల్లెట్‌ ఫోన్‌కు తగిలి ఆగిపోవడంతో తాను ప్రాణాలతో బయటపడగలిగానని అతడితో చెప్పిందామె. అయితే ఫోన్‌ వెనకవైపు అడుగు భాగం దెబ్బతిన్నా ముందువైపు ఫోన్‌కు ఏమీ కాకపోవడం విశేషం. సొ… ఐఫోన్ మహిళ పట్ల ప్రాణదాతగా పరిణమించి ఆమెకు పునర్జన్మను ఇచ్చింది.