Search
Friday 21 September 2018
  • :
  • :

దొండవారిగూడెంలో మహిళ దారుణ హత్య

Woman's Murder at Dondavarigudem

నల్లగొండ : మిర్యాలగూడ మండలం దొండవారిగూడెంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ గ్రామానికి చెందిన వీరమళ్లు లక్ష్మమ్మ (65), ఆమె దాయాదులకు మధ్య భూ వివాదం ఉంది. దీంతో ప్రత్యర్థులు లక్ష్మమ్మను కత్తులతో నరికి చంపేశారు. లక్ష్మమ్మ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మమ్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman’s Murder at Dondavarigudem

Comments

comments