Home భద్రాద్రి కొత్తగూడెం ఆదర్శ వనితలు

ఆదర్శ వనితలు

girl-1

ఆడవాళ్లు అంటే ఇంటిపట్టునే ఉండి ఎదో ఒక పని చేస్తుండడం మనం చూస్తుంటాం. పరిస్థితులకు అనుగుణంగా ఇటీవలి కాలంలో వారిలోనూ మార్పొస్తోంది. కాలంతో సమానంగా పరిగెత్తగలమని వారూ నిరూపిస్తున్నారు. అయితే పల్లెల్లో మాత్రం పరిస్థితి ఇంక ఒకప్పటిలాగే ఉంది. మహిళలు నేటికీ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో ఎందరికో ఆదర్శంగా నిలవాలని భావించారు ఆ యువతులు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. “పెళ్లీడొచ్చింది.. నీకెందుమ్మా ఈ కష్టాలు.. మా బాధలేవో మేం పడతాం… నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టేస్తాం… తర్వాత కాలమే గడుస్తుంది” అని తల్లిదండ్రులు వారించినప్పటికీ వారు వెనుదిరగ లేదు.

చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలకోర్చి తమను అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు మలిదశలో చేయూతగా నిలవాలనుకున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించేదని జానంపేటకు చెందిన బాడిశ రాణి, కరకగూడేనికి చెందిన సుమలత, కొత్తూరుకు చెందిన అమల చెబుతున్నారు. ప్రారంభంలో కొందరు వద్దని సలహా ఇచ్చారని, పట్టణాల్లో అయితే బాగానే ఉంటుందని కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందవుతుందని అన్నారని తెలిపారు. కానీ తర్వాత వారే మళ్లీ ప్రశంసించారని తెలిపారు. గ్రామంలో, ఇక్కడి తోటి సిబ్బంది, పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. వారి సహకారం మరువలేనిదని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళతామని చెప్పారు. ఆ వనితలు అందరికీ ఆదర్శం… సాధారణంగా పల్లెటూరు అనగానే పదో తరగతి చదివించడం.. ఇంకా అంటే ఇంటర్మీడియట్, ఇకతప్పదంటే

డిగ్రీ వెంటనే పెళ్లి చేసేయ్యడం. అత్తారింటికి సాగనంపడం పరిపాటే. ఆ మాత్రం ఆర్థిక స్థోమత కూడా లేకపోతే పది పూర్తికాగానే పెళ్లి చేసేయ్యడమే. కానీ దీనికి ధీటుగా ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని శ్రీ రామా ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేసే యువతులు కనిపిస్తున్నారు. మగాళ్లకు మేము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన వెంటనే ఎంతోమంది అమ్మాయిలు మీ వల్ల ఏమవుతుందిలే.. నాలుగు రోజులు చేసి వీళ్లే మానేస్తారులే.. అన్న వాళ్లే. కానీ ప్రస్తుతం వాళ్లందరూ అవాక్కవుతున్నారు. ఏదైనా అమ్మాయిలకే సాధ్యమని అంటున్నారు. అక్కడికి పెట్రోల్ కోసం వచ్చే వారిని అప్యాయంగా పలకరించడం, సంప్రదాయంగా మెల గడం ఇవన్నీ చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు. వనితలు పనిచేస్తే.. ఇక తిరుగుండదని నిరూపిస్తున్న ఈ అమ్మాయిలు అందరికీ ఆదర్శం.

ఆర్థిక పరిస్థితులు అనుకూలించకే.. కుటుంబలోని ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ఇక్కడ పనిచేస్తూ కుటుంబానికి ఆర్ధికంగా తోడుపడుతున్నాం, చదుకొవాలనే తపన ఉన్నపటికి, కుటుంబ సమస్యల కారణంగా చదువు కొనసాగించ లేక పోయాం. కానీ ఇక్కడ పని చేయటం
సంతోషదాయకంగా ఉంది, ఆర్ధికంగా కుండా కుటుంబానికి చేయుత నిస్తూ తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనే లక్షం ఇక్కడ పని చేయటం వలన నేరవేరుతుంది.
బాడిశ
రాణి,
జానంపేట.

ఆనందంగా ఉంది…
నాలుగురితో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటంబ సమస్యల కారణంగా ఇంటికి ఆర్థికంగా తోడు ఉండలనే
ఈ నిర్ణయం తీసుకు న్నాను. ఇక్కడికి వచ్చే అనేకరకాల వారికి అన్ని విధాలుగా సమాదా నాలు చేపుతూ..పట్టు విడువని విక్ర మార్కురాలిగా దైర్యంతో ముందుకు సాగుతున్నాం.
రేగ అమల, కొత్తూరు.

ఆర్థిక పరిస్థితులు అనుకూలించకే..

కుటుంబలోని ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా ఇక్కడ పనిచేస్తూ కుటుంబానికి ఆర్ధికంగా తోడుపడుతున్నాం, చదుకొవాలనే తపన ఉన్నపటికి, కుటుంబ సమస్యల కారణంగా చదువు కొనసాగించ లేక పోయాం. కానీ ఇక్కడ పని చేయటం సంతోషదాయకంగా ఉంది, ఆర్ధికంగా కుండా కుటుంబానికి చేయుత నిస్తూ తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనే లక్షం ఇక్కడ పని చేయటం వలన నేరవేరుతుంది.
బాడిశ
రాణి,
జానంపేట.
ఆదర్శంగా నిలుస్తాం…
ఆడవాళ్ళలంటే ఇంటికే పరిమితం కాదని, అన్ని రంగాలలో ముందుకు సాగుతూ నేటి ఆడపడుచులకు మేము ఆదర్శంగా నిలుస్తాం. పెంచిన తల్లిదండ్రులకు పెను బారం కాకుండా ఆడ పిల్లలను ఎందుకు కన్నామా అనే మాట వారి నోట రాకుండా ఉండే విధంగా ముం దుకు సాగుతున్నాం. పని మనది ఫలితం మనది అనే దోరణితో పని చేస్తూ ముందుకు సాగుతాం.