Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లవర్‌పై యాసిడ్ చల్లిన ప్రియురాలు

accid-attackహైదరాబాద్: పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఓ ప్రియురాలు తన లవర్‌పై దాడి చేసింది. ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకుందామంటే ప్రియుడు నిరాకరించాడు. దీంతో ప్రియుడిపై ఆమె యాసిడి చల్లింది. లవర్‌పై యాసిడ్ దాడి చేసిన ఆమెను  మోమెల్ మాయిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో జరిగినట్లు సమాచారం. యాసిడ్ దాడికి గురైన వ్యక్తి సాదక్త్ అలీగా గుర్తించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు మధ్య సంబందం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అబ్బాయిపై మహిళ దాడి చేయడం పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. నిజానికి ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. మాయి తన భర్తకు విడాకులు ఇచ్చి సాదక్త్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. అతను పెళ్లి వద్దని చెప్పడంతో మాయి దాడి చేసిందని పోలీసులు పేర్కొన్నారు.

Comments

comments