Home ఆఫ్ బీట్ పవర్ ఉంటేనే మహిళలు మరింత రాణిస్తారు

పవర్ ఉంటేనే మహిళలు మరింత రాణిస్తారు

HAPPY-WOMANS-DAY

కాగితాలకే పరిమితమవుతున్న నినాదాలు
మహిళలకు కరువైన స్వేచ్ఛ
మహిళ ప్రజాప్రతినిధులు సంతకాలకు, ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితం
అధికారం చెలాయించేది మాత్రం కుటుంభ సభ్యులే

ఒక స్నేహితురాలిగా, సంరక్షకురాలిగా, విశాల నిర్దేశకురాలిగా, సహధర్మచారిణిగా ప్రేమతో అందరి మనస్సులు గెలుచుకుంటూ పదిమందిలో ప్రతిభతో వెలుగుతున్న ఓ స్త్రీ నికిదే వందనం

 ఆర్ధికాభివృద్ధిలో దూసుకుపోతున్న మహిళలు
 అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ
 ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న నారీమణులు
 చట్టాలు కఠిన తరం చేయాలన్న మహిళలు
 నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్లే.. నువ్వు సమాజంలో సగభాగం అని చాటాలే.. 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ హక్కుల సాధన కోసం సంఘటితం కావాలని మహిళా సంఘాలు పిలుపునిస్తున్నాయి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్నికల సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు తీర్మానిస్తున్నా, ఎన్నికల అనంతరం గెలిచిన పార్టీలు బిల్లును ప్రవేశపెట్టడంలో విఫలమవుతూ వస్తున్నాయి.

వంటింటికే పరిమితమైన స్త్రీ జాతికి ఓ ఉనికిని, ఊపిరిని అందించేందుకు మీరు సల్పిన  పోరుకు ఒక వందనం. సందర్భమేదైనా, సన్నివేశమేదయినా.. శక్తి సామర్థాలే కొలమానమైన చోట లింగ వివక్షకు తావులేకుండా నిష్కర్షగా, క్రియాశీలంగా నీ శక్తిని ప్రపంచ నలు చెరుగులా చాటుతున్న నీ ప్రతిభకు వేనవేల వందనం.. మహిళా దినోత్సవాన అమ్మా! నీకు మరోమారు శుభాభివందనం..

మన తెలంగాణ/సిటీ బ్యూరో : ఆకాశంలో సగం…. అధికారంలో సగం ఉన్నా పాలనపరమైన సమస్యలు మహిళాలోకానికి శాపంగా మారుతోంది. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని పెద్దలు ఉపన్యాసాలు గుప్పిస్తున్నా వారిపై ఇంకా కొనసాగుతోన్న ఆధిపత్యం.. ‘సగం’ నినాదం కాగితాలకే పరిమితం అవుతోంది. ఉన్నతమైన చదువులు ఉన్నా… రాణించే సత్తా ఉన్నా అధికార పెద్దలు, కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే వారి పాలన సాగుతోండటం ఇటు అధికారిణిలకు మహిళా ప్రజాప్రతినిధులకు సమస్యగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక శాఖల్లో మహిళా అధికారులు బల్దియాలో సగానికి పైగా మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్నా వారికి సరైన స్వేచ్ఛలేదన్నది బహిరంగ రహస్యం. సమర్థులైన మహిళలు అధికార యంత్రాంగంలో ఉన్నా ప్రజాప్రతినిధులుగా ఉన్నా మొక్కుబడిగానే వారి పాలన సాగిస్తున్నారన్న విషయం తెలిసిందే. బల్దియాలో 150 డివిజన్‌లకు గాను సగానికి పైగా డివిజన్‌లలో మహిళలు కార్పొరేటర్లుగా గెలిచినా ఇంకా వారి కుటుంబసభ్యులే పెత్తనం సాగిస్తుండటం విశేషం.

మహిళ ప్రజాప్రతినిధులకే కేవలం సంతకాలకు, ప్రారంభోత్సవాలకు పరిమితం చేసి కుటుంబసభ్యులే అధికారం చెలాయిస్తుండట ం మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉందన్న విషయం అవగతం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమర్ధులైన మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు పాలనాపరమైన పదవుల్లో ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదన్న విమర్శలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. మహిళలు సగం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి అధికారాలను కూడా సమర్థవంతంగా అమలుచేస్తేనే మహిళామణులకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని నగర మహిళలు పేర్కొంటున్నారు. ఈవిధంగా మహిళలను ప్రోత్సహిస్తే వారు మరింత రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మునుముందూ అన్ని రంగాల్లో మహిళందరూ మరింత రాణించాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరందరికి మన తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుతోంది.

ముఖ్య విభాగాల అధికారులందరూ మహిళలే : జిల్లాలో అధికార యంత్రాంగంలో మహిళా అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓచేతితో ఇంటినీ మరోచేతితో జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. జిల్లా పరిపాలనకు సంబంధించి కలెక్టర్ మొదల్కొని పలు కీలక బాధ్యతలను మహిళా అధికారులే ఉండడం హైదరాబాద్ జిల్లా ప్రత్యేకత. 40 లక్షల జనాభా, పరిపాలన పరంగా, ఆర్థిక పరంగా రాష్ట్ర రాజధాని కేంద్రం కూడా అయిన హైదరాబాద్ మహిళా అధికారుల పాలన పురోగాభివృద్ది వైపు అడుగులు వస్తోంది. ్ల కలెక్టరే నుంచి లా ఆఫీసర్ వరకు, తహసిల్దార్ల నుంచి సెక్షన్స్ సూపరింటెండేంట్ల మొదల్కొని, డిఇఓ, డిఎంఅండ్ హెచ్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి, వరకు జిల్లాలో అధిక భాగం మహిళ అధికారులే పనిచేస్తున్నారు.

ఇందులో పలువురు అధికారులు జంట బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో పై అధికారులతో పాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వారికి తప్పడం లేదు. దీంతో కొన్ని సందర్భాలత్లో కొంత వెనక్కి తగ్గినా, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా జాతీయ ఆవార్డును సైతం సొంతం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌గా యోగితారాణా, జాయింట్ కలెక్టర్‌గా కె.నిఖిల, జిల్లా రెవెన్యూ అధికారిగా సరళా వందనం, యుఎల్‌సిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా విజయలక్ష్మి, లీలావతి, డిప్యూటీ కలెక్టర్ ఎన్.రాధిక రమణి, ఆర్‌డిఓ చంంద్రకళ, డిఇఓగా బి. వెంకట నర్సమ్మ, శిశు మహిళా సంక్షేమాధికారిగా జి.ఎస్.సునంద, డిఎంఅండ్ హెచ్ ఒగా డాక్టర్ పద్మజ, బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 16 మంది తహసిల్దార్లకు గాను 8మంది మహిళా తహసీల్దార్లు పనిచేస్తున్నారు. సిహెచ్.సుజాత (షేక్‌పేట్), శైలజ (ముషీరాబాద్, హిమాయత్ నగర్), జానకి (మారెడ్‌పల్లి), జుబేదా బేగం (చార్మీనార్), ప్రేమలతా (నాంపల్లి), చంద్రకళ (అంబర్‌పేట్) తహసిల్దార్లుగా పని చేస్తున్నారు.

మహిళలను గౌరవించాలి

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ముందుగా శుభాకాంక్షలు. జిల్లాలో కీలక బాధ్యతలు మహిళా అధికారులే నిర్వహించడం సంతోషంగా ఉంది. అయితే కేవలం మహిళా దినోత్సం సందర్భంగా గౌరవం ఇవ్వడం కాదని, దీనిని ప్రతి రోజు ఇచ్చినప్పుడే మహిళలందరూ రాణిస్తారు. కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లా అధికారులంతా కలిసి బేటీ బచావో, బేటీ పడాదో పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా జాతీయ అవార్డును సాధించాం.
– జాయింట్ కలెక్టర్ కె.నిఖిల

కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి

ప్రస్తుతం మహిళలను అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే వారు మరింత రాణించాలంటే కుటుంబ సభ్యులు మహిళలను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరముంది. అప్పుడు వారు అనుకున్న విజయం సాధిస్తారు. జిల్లా మహిళలు, శిశు సంక్షేం కోసం కలెక్టర్ ఆదేశాలతో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాను. మహిళలు సగం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి అధికారాలను కూడా సమర్థవంతంగా అమలుచేస్తేనే మహిళామణులకు సరైన గౌరవ ఇచ్చినట్లు అవుతుంది.
– జి.ఎస్.సునంద, మహిళా శిశు సంక్షేమాధికారి 

పథకాలను అందిపుచ్చుకోవాలి

మహిళల పురోగాభివృద్ధి కోసం ప్రభు త్వం ఏనలేని కృషి చేస్తోంది. ఈ అకాశాన్ని మహిళందరూ అందిపుచ్చుకోవడం ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కావాలి. 40 లక్షల జనాభా, పరిపాలన పరంగా, ఆర్థి క పరంగా రాష్ట్ర రాజధాని కేంద్రం కూడా అయిన హైదరాబాద్ మహిళా అధికారుల పాలన పురోగాభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. మహిళలు సగం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి అధికారాలను కూడా సమర్థవంతంగా అమలుచేస్తేనే సరైన గౌరవం ఇచ్చినట్లు.
 – డిఆర్‌ఓ సరళావందనం

ఆకాశమే హద్దుగా దూసుకుపోదాం

మహిళలందరం ఆకాశమే హద్దుగా దూసుకు పోదాం. మహిళలు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునే హక్కు కూడా ఉంది. సమాజంలో పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. వీటిని సాధించుకోవడానికి ముందుగా లింగ విక్షణను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేయాల్సి ఉంది. మహిళలు అధికార యంత్రాంగంలో ఉన్నా ప్రజాప్రతినిధులుగా ఉన్నా నా వంతు బాధ్యత ఇప్పటికే నేను సమాజానికి సేవ చేయడంతోపాటు వికలాంగుల అభ్యున్నతి కోసం సాయ శక్తులా కృషి చేస్తున్నాను.
– కె.గౌతమి నాయుడు, హిందీ పండిత్

ఇంటా, బయట సహకారం అందించాలి

మహిళలకు ఇంటా, బయట అన్ని విధాల సహాయ సహాకారాలు అందించినప్పుడే వారు మరింత ప్రగతి పథంలో ప్రయాణిస్తారు. మహిళలు రాజకీయలో రాణించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తితో మరవలేనిది. గ్రేటర్ కార్పొరేటర్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో వివిధ సంస్థల చైర్మన్ల పదవుల్లో సైతం వాటి అమలు చేయడం మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో దోహదం చేస్తోంది.
– సర్వలతా రెడ్డి, రాజేందర్‌నగర్ నియోజకవర్గం, టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి

విధులు నిర్వహిస్తే ఒత్తిడి దూరం

ఎంత కీలక బాధ్యతలు నిర్వహించినా ఇటు ఉద్యోగానికి, అటు కుటుంబానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నాను. అయితే ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఏలాంటి ఒత్తిడి లేకుండా చూసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇదే ఫార్ములాను ప్రతిరోజూ పాటి స్తూ ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా మేము నిర్వహిస్తున్నాము.
– ఎన్.రాధిక రమణి, డిప్యుటీ కలెక్టర్

పునాదులు వేసుకోవాలి

నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మహిళలంద రూ అందివచ్చినా ప్రతి అవకాశాన్ని శక్తివంతంగా వినియోగించుకుని దూసుకుపోవడం రేపటి తరానికి ఇబ్బందులు లే కుండా చూడాలన్నది ఆకాంక్ష. సైద్దాంతిక పునాదులు ఇప్పటికే ఉన్నాయి. వాటి ఆచారణాత్మాక పునాదులను మహిళలే బలంగా వేసుకోవాలి. అప్పడే అనుకున్న స్థాయిలో రాణించగల్గుతాం. మహిళలను ప్రోత్సహిస్తే వారు మరింత రాణించే అవకాశం ఉంటుంది
– వెంకట నర్సమ్మ, డిఇఓ

అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి

నాడు మహిళలు బయటికి రావాలంటే కుటుంబ సభ్యులను తోడు ఇచ్చి పంపేవారు. కాని నేడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్ల మొదల్కొని దేశ రక్షణ స్థాయి వరకు మహిళలు ఎదిగారు. అధికార యంత్రాంగంలో మహిళా అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ చేతితో ఇంటినీ మరోచేతితో జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ సత్తా చాటుతున్నాం. ఇది మన దేశం మహిళలకు ఇస్తున్న గౌరవం. మహిళలు చేయి చాచకుండా చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.
   – వీరన్నగారి రాధ, బిజెపి కార్పొరేటర్