Home యాదాద్రి భువనగిరి ఉద్దీపన ఉత్పత్తులు, విక్రయ కేంద్రాల పరిశీలన

ఉద్దీపన ఉత్పత్తులు, విక్రయ కేంద్రాల పరిశీలన

women associations for improving sanitation in schools

మన తెలంగాణ/రామన్నపేట : పాఠశాలల్లో పారి శుధ్యం మెరుగుపరచడం కోసం మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు ఉపయోగకరంగా ఉన్నా యని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్, ప్రొఫెసర్లు సొనాల్ మోబోరాయ్, లోక్ సింగ్‌లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో పేద విద్యా ర్థులకు ఆంగ్ల మాద్యమంలో మెరుగైన విద్యను అందిం చడానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్ధీపన కార్యక్రమాన్ని ఎన్‌ఐఆర్‌డి ఆధ్వ ర్యంలో 8 దేశాలకు చెందిన 12 మంది విద్యార్థులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది విద్యార్థులు బుధవారం రామన్నపేటలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఉద్దీపన ఉత్పత్తుల కేంద్రంను, విక్రయ కేంద్రంను సందర్శించారు. హ్యాండ్‌వాష్, డిష్‌వాష్, ఫ్లోర్‌వాష్, టాయిలెట్‌వాష్, డిటర్జెంట్ ఫౌడర్ తయారు చేసే విధానాన్ని, వాటి ఉత్పత్తికి అయ్యే ఖర్చు, విక్రయం చేస్తున్న తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దీపణ ఉత్పత్తులు పాఠశాలతో పాటు, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో పారిశుధ్యం మెరుగుకు దోహదపడుతాయని తెలిపారు. వారి వెంట మండల విద్యాధికారి సల్వాది దుర్గయ్య,సిసి అహల్య, నిర్వాహకులు కట్కూరి రమ్య, బైరబోయిన రాదిక, బుడ్డ మంజుల, దేవరాయి సునీత, కట్కూరి మమత ఉన్నారు.