Home నల్లగొండ మహిళపై దాడి

మహిళపై దాడి

women Attack on other women

తిరుమలగిరి(సాగర్) : తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న నేపంతో మహిళ సదరు మహిళపై దాడి చేసిన ఘటన మండలంలోని అల్వాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అల్వాల గ్రామానికి చెందిన నాంపల్లి రేణుక తన భర్త పుల్లయ్యతో అదే గ్రామానికి చెందిన మల్లెబోయిన ముత్యాలమ్మ అక్రమ సంబంధం పెట్టుకొని ప్రతిరోజూ చరవాణిలో మాట్లాడుతుండటంతో రేణుక సోమవారం ఉదయం ముత్యాలమ్మను బంధువులతో కలిసి చితకబాదింది. దీంతో ముత్యాలమ్మకు గాయాలు కావడంతో గ్రామస్తులు నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ముత్యాలమ్మ ఫిర్యాదు మేరకు నాంపల్లి పుల్లయ్య, రేణుక, మరికొందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.