Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తల్లీకూతురు ఆత్మహత్యయత్నం…

Mother, daughter attempt suicide

ఖమ్మం: సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చిన వ్యక్తి మోసగించాడని ఆరోపిస్తూ ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన సోమవారం నగరంలోని శ్రీనగర్ ల ో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీతరాంపురానికి చెందిన ఆటో డ్రైవర్ సిహెచ్ రామారావు అనే వ్యక్తి  సంభానీనగర్‌కు చెందిన సునీత అనే యువతితో ప్రేమ పేరుతో యువతికి దగ్గరై ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. కొంతకాలానికి వారిరువురి మధ్య విభేదాలు ఏర్పడి ఆర్ధిక ఒప్పందం కుదుర్చుకొని విడిపోవడం జరిగింది. అనంతరం రామారావు తన బంధువైన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.  గత ఏడాదికాలంగా రామారావు మళ్లీ మొదట సహజీవనం సాగించిన సునీతకి దగ్గరై తిరిగి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనతో కాపురం చేస్తుండటంతో సునీత రామారావు ఇచ్చిన డబ్బులను తిరిగివ్వగా ఆటోను కొనుగోలు చేసుకున్నట్లు యువతి వాపోయింది. అయితే కొద్దిరోజులుగా రామారావు, అతని బంధువులు బెదిరింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేని సునీత తన తొమ్మిదేళ్ల కుమార్తెతో శ్రీరాంనగర్ వద్ద గల వాటర్ ట్యాంక్ ఎక్కి దూకి చనిపోతామంటూ బెదిరింపులకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు సిఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని యువతితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. చివరకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సునీత కిందకు దిగింది. ఈ ఘటనా పై పోలీసులు  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments