Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు పిల్లలు సహా చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

                     Suicide

వనపర్తి: భర్త చిత్రహింసలు, వేధిపులు భరించలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దగూడెం తండా పరిధిలోని పైగడ్డలో చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంతోషి (23)కు ఐదేళ్ల క్రితం పెంట్లవెళ్లి మండల కేంద్రానికి చెందిన మద్దిలేటితో వివాహం జరిగింది. వీరికి మోక్షిత్ (4), వివేక్ (3) ఇద్దరు పిల్లలున్నారు. వివాహ సమయంలోనే కట్న కానుక లిచ్చినా మద్దిలేటి భార్య సంతోషిని వేధిస్తున్నాడు. రెండు రోజులుగా వేధింపు లు ఎక్కువ కావ డంతో గురువారం సంతోషి తల్లిదండ్రులు పెంట్లవెళ్లి నుంచి పుట్టింటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సంతోషి తల్లిదండ్రులకు తెలియకుం డా తన ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. ముందుగా పిల్లల్ని చెరువులో తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments