Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కుమార్తె కాళ్లు కట్టివేసి ఒడిలో పెట్టుకుని నిప్పంటించుకున్న మహిళ

Women-sucide

మన తెలంగాణ/బిజినేపల్లి : మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఒక తల్లి ఐదేళ్ల కుమార్తెను కాళ్లు కట్టివేసి ఒడిలో పెట్టుకొని నిప్పంటించుకున్నది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని 9వ వార్డు సభ్యురా లైన బాలూబీ పెద్ద కూతురు స్వప్న(30)ను  13 ఏళ్ల క్రితం మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామా నికి చెందిన గుడ్ల సతీష్‌కు ఇచ్చి వివాహం జరి పించారు. వీరికి ఇద్దరు కూతుర్లు. వివాహం అయిన నాటి నుంచి  సజావుగా సాగిన కాపురంలో ఏమి జరిగిందో ఎమోగానీ  స్వప్న శని వారం తన కూతుళ్లతో మండల కేంద్రంలోని కన్నవారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చిన్నకూతురైన అక్షిత(5) కాళ్లను కట్టివేసి చేతితో ఒడిసిపట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఆక్కడి క్కడే మృతి చెందారు. పొలం పనులను చేసి వచ్చి న తండ్రికి ఇంట్లో పొగలు రావడంతో చుట్టు పక్కల వారిని పిలిచి తలుపులు బద్దలు గొట్టారు. అప్పటికే తల్లీ కూతుళ్ల్లు విగత జీవులై ఉన్నారు. అమ్మమ్మతో కలిసి పొలానికి పెద్ద కూతురు ప్రాణాలతో బయటపడింది. కుటుంబ కలహాలతో ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.

Comments

comments