Home నల్లగొండ నల్లగొండ జిల్లా కేంద్రాసుపత్రిలో ఘోరం

నల్లగొండ జిల్లా కేంద్రాసుపత్రిలో ఘోరం

Women Deliver Infront Of Govt Hospital In Nalgonda
నల్లగొండ: పేరుకు పెద్దాసుపత్రి..అందులోనూ భవిష్యత్‌లో వైద్య విద్య కళాశాలగా రూపుదిద్దకోనున్న నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి. ఇప్పటికే కార్పోరేట్‌ స్థాయికి చేరుకుందున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న ఆసుపత్రికి మచ్చతెచ్చే సంఘటన గురువారం చోటు చేసుకుంది. అంతటి పెద్దా ఆసుపత్రి వైద్య బృందం నిరుపేద గర్బిణీ ఆరోగ్య పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడం మూలంగా సదరు గర్బిణీ స్త్రీ ఆరుబయటనే ప్రసవించిన హృదయ విదారకర సంఘటన పట్ల విమర్శలు పెద్ద ఎత్తున వెల్లు వెత్తున్నాయి. ఆసుపత్రిలో కిక్కిరిసిన జన సందోహం మధ్య మహిళా ప్రసవించడంతో ప్రతి ఒక్కరు పేరుకే పెద్దాసుపత్రి తీరా చూస్తే ఒక పేద మహిళ బహిరంగంగా ప్రసవించడం సిగ్గుచేటన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. వివరాల్లోకి వెళ్తే…నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇంజమూరి స్వాతి(22)కి ప్రసవ సమయం దగ్గర పడడంతో ఉమ్మడి జిల్లాలో పేరు ప్రఖ్యాతలు గొప్పగా గడించిన నల్లగొండ ఆసుపత్రికి వచ్చారు. భర్త గోపి, అత్తతో కలిసి బుధవారం ఆసుపత్రి ఔట్‌ పేషెంట్ విభాగంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

పరీక్షల అనంతరం స్వాతికి రక్తం శాతం తక్కువడం ఉందని, ఆసుపత్రిలో ఏబి పాజిటివ్ రక్త లేనందున మరో రెండు రోజుల సమయం ఉన్న నేపధ్యంలో బయట నుంచి తెచ్చుకోవాలని, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలని సూచించారు. దీంతో ఆయోమయానికి గురైన ఆ పేద కుటుంబం హైదరాబాద్ వెళ్ళలేక ఆసుపత్రి ఆవరణలో వేసవికాలం దృష్టా రోగుల బంధువులు, సందర్శకుల కోసం వేసి టెంట్‌లోనే తలదాచుకునేందుకు సిద్దమయ్యారు. స్వాతి భర్త గోపి ఎలాగైనా ఏబి పాజిటివ్ రక్తాన్ని రెడ్‌క్రాస్ వంటి రక్తనిధి కేంద్రాల నుంచి సేకరించే క్రమంలో నల్లగొండ, నార్కట్‌పల్లి కామినేని వంటి ప్రాంతాల్లో కలియ తిరిగాడు. అయినా ఫలితం దక్కకపోవడంతో ప్రసవానికి మరోరోజు సమయం ఉన్నందున మళ్ళీ ప్రయత్నం చేసేందుకు సిద్ద పడుతున్న సమయంలో గురువారం ఉదయం 9.30ని॥ ప్రాంతంలో టిఫిన్, టీ కోసం వెళ్ళేందుకు నాలుగు అడుగులు వేయగానే అనుకోకుండా పురిటి నొప్పులు రావడం, వెను వెంటనే టెంట్ కిందనే ప్రసవించడం చకచకా జరిగి పోయాయి. దీంతో అక్కడి వారంత నివ్వెరపోయి అయ్యే పాపం ఆసుపత్రికి వచ్చి కూడా ఆరుబయట ప్రసవించడం పట్ల సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. కనీసం రక్త బయల నుంచి సేకరించే వరకైనా ఇన్‌పేషెంట్ అవకాశం ఇచ్చి ఉంటే వీరి సొమ్మేమైనా పోయోదా అంటూ వైద్య బృందంపై మాటల యుద్దం చేశారు. అంతా అయిపోయినాక ఆసుపత్రి సిబ్బంది హడావుడిగా తల్లిబిడ్డలను స్ట్రెచర్‌పై వార్డుకు తీసుకెళ్ళి ఆవసరమైన చికిత్సకు ఉపక్రమించారు. దీంతో దేవుని దయ వల్ల అంతా మంచే జరిగిందని స్వాతి కుటుంబ సభ్యులు, అక్కడి సందర్శకులంతా ఊపిరిపీల్చుకున్నారు.