Home మెదక్ వరండాలో మహిళ ప్రసవం

వరండాలో మహిళ ప్రసవం

నెలలు నిండినా కాన్పుకు సమయం
ఉందని వైద్యుల నిర్లక్షం
ప్రసవంతో ఉలిక్కిపడ్డ
వైద్యులు, సిబ్బంది

 మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఘటన

delivery

మెదక్: ప్రభుత్వ ఏరియా ఆసు పత్రికి నెలలు నిండి ప్రసవం కోసం వచ్చిన మహి ళపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించి వెనక్కి పంప డంతో వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన మెదక్ ఏరియా ఆసుపత్రిలో సంచలనం రేపింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైద్యులు, సిబ్బంది మహిళను అప్పటికప్పుడే ప్రసూతి గదిలోకి తీసు కెళ్లి తల్లీబిడ్డకు చికిత్స అందించారు. దీంతో తల్లి తో పాటు జన్మించిన మగ శిశువు క్షేమంగా ప్రా ణాపాయం నుంచి బయడపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెం దిన యశోద (22)ను భర్త, అత్త మొదటి ప్రసవం కోసం సోమవారం ఉదయం 9 గంటలకు ప్రభు త్వ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా తనకు రక్త లోపం ఉందని, ఇక్కడ నీకు ప్రసవం చేయడం కష్టం, వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది ఆమెకు సూచించారు.

దీంతో ఆమె అక్కడికక్కడే వణికిపోతూ ఏడ్చుకుంటూ త మకు హైదరాబాద్ వెళ్లే స్థోమత లేదని, ఎలాగైనా ఇక్కడే ప్రసవం జరిపించమని వేడుకోగా ప్రసవా నికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉంది వెళ్లమని సిబ్బంది బదులివ్వగా వెనుదిరిగి వస్తున్న క్రమంలో ఆసుపత్రిలో గల మూత్రశాల వద్ద పురిటినొప్పులు తట్టుకోలేని యశోద అక్కడే మగ శిశువుకు జన్మనిచ్చిందని చుట్టుపక్కల సి బ్బంది ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చి న వారే ఆ మహిళను సురక్షితంగా పట్టుకుని వై ద్యులను, సిబ్బందిని పిలిచినట్లు అక్కడ ఉన్నవా రు తెలిపారు. ఈ విషయమై ఏరియా ఆసుప త్రిలోని వైద్యులను వివరణ కోరగా ఒక్కోసారి అలా జరగడం సర్వసాధారణమని, ప్రస్తుతానికి ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని, ఇదివరకు ఎన్నోసార్లు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లినా లాభం లేకపోయిందని తెలిపారు. రోగు లకు తగ్గ వైద్యులు, సిబ్బంది ఉంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని వారు వివరించారు.