Search
Wednesday 14 November 2018
  • :
  • :

లారీ ఢీకొని మహిళ మృతి

Women Dies In Road Accident In Vikarabad District

పెద్దేముల్‌ః లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మంబాపూర్ గ్రామానికి చెందిన చెన్నారం మాణిక్యమ్మ(65) శనివారం ఉదయం కోడలు,మనువరాలుతో కలిసి ధారూర్‌ మండల కేంద్రంలోని  ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రి  నుంచి తిరిగి వస్తున్న సమయంలో మంబాపూర్ గ్రామంలో బస్సు దిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఆగి ఉన్న లారీ వెనక్కి తీసుకున్నాడు. దీంతో లారీ వెనక ఉన్న మాణిక్యమ్మ వెనక టైర్ల క్రింద పడిపోయి తీవ్ర గాయాలతో  అక్కడికక్కడే మృతి చెందింది. కోడలు,మనవరాలు దూరంగా ఉండటంతో వారికి స్వల్ప గాయాలైయ్యాయి .సంఘటన స్థలానికి తాండూరు డిఎస్పి రామచంద్రుడు, సిఐ సైదిరెడ్డి ,పేద్దేముల్ ఎస్ఐ వెంకటశ్రీను చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments