Home అంతర్జాతీయ వార్తలు ఆమెకు భూమ్మీద నూకలున్నాయి….

ఆమెకు భూమ్మీద నూకలున్నాయి….

 Dangerous Accident

 

కాన్ బెర్రా: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ప్రాంతం తుల్‌మెరైన్‌లో జాతీయ రహదారిపై 53 ఏళ్ల గల మహిళ తన కారులో ప్రయాణిస్తుంది. ఆకస్మాత్తుగా పైనుంచి పెద్ద హోర్డింగ్ బోర్డు కారుపై పడింది. అక్కడి ఉన్నవారు ఆమె మృతి చెంది ఉంటుందని అనుకున్నారు. కానీ వెంట్రుకవాసిలో ఆ ప్రమాదం నుంచి బయటపడింది. ఆమెకు చిన్నపాటి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రమాదం నుంచి ఆమె బయటపడడం అద్భుతమని అక్కడ ఉన్న వాహనదారులు తెలిపారు. హోర్డింగ్ కారు మీద పడగానే ఆమె కారును ఎడమవైపు తిప్పడంతో హోర్డింగ్ కుడి వైపు ఒరిగిపోవడంతో  ఆమె ప్రాణాలతో బయటపడింది.  భూమ్మీద నూకలుండాలే కాని ఎలాంటి ప్రమాదం ఏమీ చేయలేదనడానికి  ఈ సంఘటననే ఉదహరణంగా చెప్పుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.