Home తాజా వార్తలు 5వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి

5వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి

ప్రమాదషత్తు అపార్ట్ మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి

Untitled-3

మన్సూరాబాద్: ప్రమాదషత్తు మహిళ అపార్ట్ మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి పడి మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్‌బీనగర్ చిత్ర లేఅవుట్ లోని విజయసుధ అపార్ట్‌మెంట్స్‌లో 5వ అంతస్తులో కాలువ సుమతిరెడ్డి(32), మురళీమోహన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కాలువ సుమతిరెడ్డి ఇంటి వద్దె ఉంటూ చదువుతుండగా, భర్త కిమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే సుమతిరెడ్డి సొమవారం సాయంత్ర 5 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులోని తమ ప్లాట్‌లోని బాల్కానిలో తిరుగుతుండగా ప్రమాదవషత్తు జారీ 5వ అంతస్తు నుంచి క్రింద పడింది . దింతో తీవ్ర గాయలయిన సుమతిరెడ్డి అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్త మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు.

సుమతిరెడ్డి కుటుంభ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే …
సుమతిరెడ్డి మృతి విషయం తెలుసుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సుమతిరెడ్డి మృతదేహన్ని చూడడంతో పాటు స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుమతిరెడ్డి కుటుంభ సభ్యులను పరామర్శించారు.